Thursday, 12 March 2026 12:30:24 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Date : 07 February 2026 06:46 PM Views : 114

Studio18 News - TELANGANA / HYDERABAD : ఫోరెన్సిక్ ల్యాబ్‌లోని సీజ్డ్ ప్రాపర్టీస్ గదిలో అగ్ని ప్రమాదం 1980ల నాటి భవనమని వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ చివరి గదిలో స్విచ్ బోర్డు వద్ద షార్ట్ సర్క్యూట్ అయినట్లు వెల్లడి నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ స్పందించారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లోని సీజ్డ్ ప్రాపర్టీస్ గదిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ గది పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ ఫోరెన్సిక్ భవనం చాలా పాతదని, దీనిని 1980లలో నిర్మించారని తెలిపారు. చివరి గదిలో ఉన్న స్విచ్ బోర్డు వద్ద షార్ట్ సర్క్యూట్ అయినట్లు తెలిపారు. అక్కడి నుంచి మంటలు వ్యాపించాయని, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయని అన్నారు. హైదరాబాద్‌లోని అన్ని భవనాలను తనిఖీ చేస్తామని ఆయన తెలిపారు. రెసిడెన్షియల్, కమర్షియల్ కార్యాలయాలను తనిఖీ చేస్తామని అన్నారు. ఎండాకాలం సమీపించిన నేపథ్యంలో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉందని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :