Sunday, 08 March 2026 04:23:02 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Etela Rajender: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు

Date : 15 September 2025 07:51 PM Views : 430

Studio18 News - TELANGANA / HYDERABAD : గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్స్ చెల్లించలేదని విమర్శ రూ. 9 వేల కోట్ల బకాయిలు ఉన్నాయన్న ఈటల రాజేందర్ ప్రభుత్వాలు మారినప్పుడు పాత బకాయిలు చెల్లించాలన్న ఈటల తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలలకు గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్స్ బకాయిలు చెల్లించలేదని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్‌మెంట్స్ చెల్లిస్తోందని ఆయన అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో రూ. 9 వేల కోట్ల ఫీజు రీయింబర్సుమెంట్స్ బకాయిలు ఉన్నట్లు తెలిపారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం వల్ల చాలా నష్టం జరుగుతోందని ఆయన ఆరోపించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో బీసీ విద్యార్థులకు వంద శాతం రీయింబర్సుమెంట్స్ ఇస్తామని హామీ ఇచ్చి, పాత విధానంలో కూడా రీయింబర్సుమెంట్స్ చేయలేదని విమర్శించారు. ప్రభుత్వాలు మారినప్పుడు పాత బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. తన రాజకీయ జీవితంలో ఇంత బాధ్యతలేని ప్రభుత్వాన్ని చూడలేదని విమర్శించారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రానికి కావాల్సిన యూరియాను ఒక సంవత్సరం ముందు నిల్వ చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల రాష్ట్రంలో యూరియా కొరత తలెత్తిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టకుండా ఎరువులు వచ్చే మార్గంపై దృష్టి సారించాలని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :