Studio18 News - TELANGANA / RANGAREDDY : కాప్రా Z.P.H.S ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని కాప్రా డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు బైరీ నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి హాజరై విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, గురువులు మరియు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News