Studio18 News - తెలంగాణ / : తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ భారీ విరాళం ఇచ్చింది. ఇటీవల కురిసిన వరదలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టం సంభవించింది. దీంతో వివిధ సంస్థలు, ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. తాజాగా, తెలంగాణ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఎల్ అండ్ టీ రూ.5.50 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను ఎల్ అండ్ టీ చైర్మన్ కలిసి ఇందుకు సంబంధించిన చెక్కును అందించారు.
Admin
Studio18 News