Studio18 News - TELANGANA / : న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీసులు మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈవెంట్ ఆర్గనైజర్లు తప్పనిసరిగా నిబంధనలకు కట్టుబడి ఉండాలని, లేదంటే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఫ్యామిలీ ఫ్రెండ్లీ వాతావరణం కోసమే ఈ నిబంధనలు అమలు చేస్తున్నామని, అందరూ తప్పకుండా వీటికి కట్టుబడి నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని పోలీసులు కోరారు. ఆంక్షలు ఇలా.. * ఈవెంట్ వేదికల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. * సెలబ్రేషన్స్ సందర్భంగా అసభ్యకర, అశ్లీల డ్యాన్స్‌లకు చోటులేదు. * ధ్వని కాలుష్యం నేపథ్యంలో రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదు. * బార్లు, పబ్‌లలో మైనర్లకు అనుమతి లేదు. * పార్టీల్లో డ్రగ్స్ వినియోగించినా, సరఫరా చేస్తూ దొరికినా కఠిన చర్యలు. * డ్రంకెన్ డ్రైవింగ్ విషయంలో కఠిన చర్యలు ఉంటాయి. దొరికితే రూ. 10 వేల వరకు జరిమానాతోపాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష తప్పదు.
Also Read : పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా దుర్ఘటన.. హైకోర్టును ఆశ్రయించిన సంధ్య థియేటర్ యజమాని
Admin
Studio18 News