Sunday, 29 March 2026 05:20:55 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు

Date : 22 January 2026 07:35 PM Views : 211

Studio18 News - TELANGANA / HYDERABAD : రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణ రెండు రోజుల క్రితమే హరీశ్ రావును ప్రశ్నించిన అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. రేపు (జనవరి 23, శుక్రవారం) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై సిట్ అధికారులు 2024 మార్చి నుంచి దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో కొందరిపై ప్రధాన అభియోగపత్రం దాఖలు చేయగా, విచారణను మరింత లోతుగా కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా రెండు రోజుల క్రితం (ఈ నెల 20న) మాజీ మంత్రి హరీశ్ రావును అధికారులు సుమారు 7 గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ.. "ఉద్యమాలు మాకు కొత్త కాదు, మీలాగా పారిపోలేదు. ఇలాంటి అక్రమ కేసులు సమైక్య రాష్ట్రంలో చాలా పెట్టారు" అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హరీశ్ రావు విచారణ ముగిసిన రెండు రోజులకే కేటీఆర్‌కు నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :