Studio18 News - TELANGANA / JAGTIAL : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు లభ్యమవ్వడం జగిత్యాల పట్టణంలో కలకలం సృష్టించింది. జగిత్యాల పట్టణంలోని స్థానిక సీఎస్ఐ బాలికల ఉన్నత పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు, మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. దాంతో బాలికల పాఠశాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ఈ ఘటన బయటకురావడంతో పాఠశాల సిబ్బంధి హుటాహుటిన పాఠశాల విద్యార్థినులచే వాటిని శుభ్రం చేయించారు. ఈ నేపథ్యంలో ఘటనపై పాఠశాల సిబ్బందిని మీడియా ప్రతినిధులు వివరణ కోరగా అసాంఘిక కార్యకలాపాలకు తాము కాపలా ఉండాలా అంటూ ఉపాధ్యాయులు నిర్లక్ష్యపు సమాధానం చెప్పడమే కాకుండా అటెండర్ లేడని, విద్యార్థినుల చేత కండోమ్ ప్యాకెట్లను శుభ్రం చేయిస్తున్నమని చెప్పి అక్కడి నుండి జారుకోవడంతో స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి, ఉన్నతాధికారులు దృష్టిసారించి ఘటనకు భాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Admin
Studio18 News