Sunday, 29 March 2026 05:25:41 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

KCR: సిట్ లు, బొట్ లకు కేసీఆర్ భయపడరు: దాస్యం వినయ్ భాస్కర్

Date : 29 January 2026 06:40 PM Views : 84

Studio18 News - TELANGANA / HYDERABAD : కేసీఆర్ కీర్తిని దిగజార్చే కుట్ర జరుగుతోందన్న వినయ్ భాస్కర్ కుట్రలో భాగంగానే సిట్ నోటీసులు ఇచ్చిందని ఆరోపణ కేసీఆర్ కు కేసులు, కొట్లాటలు కొత్త కాదని వ్యాఖ్య ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణకు హాజరుకావాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు అందించారు. ఈ పరిణామం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా షేక్ చేసింది. మరోవైపు, సిట్ నోటీసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ... కేసీఆర్ కీర్తిని దిగజార్చే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ఈ కుట్రలో భాగంగానే కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ధీరుడు కేసీఆర్ అని... ఆయనకు కేసులు, కొట్లాటలు, కోర్టులు కొత్తకాదని అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడిన చరిత్ర కేసీఆర్ కు ఉందని చెప్పారు. కాంగ్రెస్ నేతల సిట్ లు, బొట్ లకు కేసీఆర్ భయపడరని అన్నారు. ఇలాంటి వాటికి బీఆర్ఎస్ బెదరదని చెప్పారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని తెలిపారు. మరోవైపు, రేపు మధ్యాహ్నం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. అయితే, ఆయన వయసును దృష్టిలో పెట్టుకుని... విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న ఏదైనా ఒక ప్లేస్ చెబితే... తామే అక్కడకు వచ్చి విచారణ జరుపుతామని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :