Studio18 News - TELANGANA / NIRMAL : నిర్మల్: ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సన్మానించిన కార్యక్రమం జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ ఆధ్వర్యంలో జరగింది. పోలీసు శాఖలో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించి, నేడు పదవి విరమణ పొందుతున్న బి. డల్లు సింగ్ (ASI), జి. శంకర్ (ASI), జెడ్. మారుతి (ASI), బి. నారాయణ రెడ్డి (ASI)లను జిల్లా ఎస్పీ ఘనంగా సన్మానించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, 1986లో కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో చేరిన బి. డల్లు సింగ్ 40 సంవత్సరాలు, 1990లో చేరిన జి. శంకర్ 36 సంవత్సరాలు, 1990లో చేరిన జెడ్. మారుతి 37 సంవత్సరాలు, 1989లో చేరిన బి. నారాయణ రెడ్డి 37 సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు అంకితభావంతో సేవలు అందించారని గుర్తుచేశారు. వారు పోలీసు శాఖకు అందించిన సేవలను కొనియాడుతూ, విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, బాధ్యతాయుత సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. అంతేకాక, వారి ఆరోగ్యం, కుటుంబ పరిస్థితి గురించి ఆప్యాయంగా అడిగి తెలుసుకుని, భవిష్యత్తులో మంచి ఆరోగ్యం, శాంతియుత జీవితం గడపాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ తో పాటు ఏవో యూనుస్ అలీ, పోలీస్ ఆఫీసర్స్ అధ్యక్షులు విరాసత్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Studio18 News