Studio18 News - TELANGANA / JAGTIAL : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ దరూర్ క్యాంప్‌లో ఉన్న ఈవీఎంలను భద్రపరిచిన గోదామును తనిఖీ చేశారు. గోదాములో ఉన్న భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నెల ఈవీఎంలను తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. గోదాములోని యంత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరు మరియు సాంకేతిక అంశాలను సమగ్రంగా పరిశీలించినట్లు చెప్పారు. గోదాము వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం అప్రమత్తతతో పర్యవేక్షణ కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. ఈ పర్యవేక్షణలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు, కలెక్టరేట్ ఏవో హకీమ్, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News