Sunday, 29 March 2026 05:19:00 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు

Date : 22 January 2026 07:09 PM Views : 206

Studio18 News - TELANGANA / HYDERABAD : ప్రజల ఖాతాల నుంచి రేవంత్ డబ్బులు తీసుకుంటున్నారన్న హరీశ్ హామీలపై మంత్రులను ప్రజలు నిలదీస్తున్న పరిస్థితి ఉందని వ్యాఖ్య డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు జారీ కావడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ప్రవర్తనకు, ఒక సైబర్ నేరగాడి ప్రవర్తనకు పెద్ద తేడా లేదంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో ప్రజల కోసం ఖజానా నుంచి డబ్బులు ఖర్చు చేశామని, కానీ రేవంత్‌రెడ్డి మాత్రం ప్రజల ఖాతాల నుంచే డబ్బులు తీసుకుంటానంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు మంత్రులను నిలదీస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, దృష్టి మళ్లించేందుకు సిట్ నోటీసులు పంపుతున్నారని విమర్శించారు. తాను, కేటీఆర్... ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ప్రశ్నిస్తున్నందు వల్లే ఈ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడబోమని, హామీల అమలుపై ప్రశ్నించడం ఆపేది లేదని స్పష్టం చేశారు. డైవర్షన్ రాజకీయాలు చేస్తూ నీ బావమరిది కుంభకోణం బయటకు రాకుండా చూడాలనే ప్రయత్నమా? అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ మంత్రులు వాటాల కోసం కొట్టుకుంటున్నారని, ఆ పార్టీ పని అయిపోయిందని హరీశ్ వ్యాఖ్యానించారు. ప్రజల ముందుకు రావడానికి కాంగ్రెస్ నేతలు జంకుతున్నారని చెప్పారు. “ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడబోం. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసే వరకూ మీ వెంటపడుతూనే ఉంటాం” అని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :