Studio18 News - TELANGANA / KHAMMAM : ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల వీడ్కోలు సమావేశం ప్రధానోపాధ్యాయులు ఆమంచి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ రూరల్ మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి జగదీష్, సర్పంచ్ బండి సతీష్, ఉప సర్పంచ్ షేక్ దావూద్, మాజీ ఏఏపిసి చైర్మన్ పప్పుల విజయ, మాజీ ఎస్‌ఎంసి చైర్మన్ పప్పుల రమణ, మాజీ జెడ్పీటీసీ పెరుమాళ్లపల్లి మోహనరావు మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలను ప్రతి సంవత్సరం కల్పిస్తున్నామని తెలిపారు. గత ఏడాది 10వ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించామని, ఇచ్చిన మాట ప్రకారం ప్రోత్సాహకాలను, నగదు బహుమతులను అందజేశామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం కూడా విద్యార్థులు మంచిగా చదువుకొని గ్రామానికి, గురువులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పప్పుల రమాదేవి రిటైర్డ్ ఉద్యోగి ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్‌లు, పెన్నులు అందించారు. గత ఏడాది ఉత్తీర్ణత సాధించిన మొదటి, రెండవ, మూడవ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు మాజీ జెడ్పీటీసీ మోహనరావు రూ.3,500 నగదు బహుమతిని అందజేశారు. రెండో వార్డు సభ్యులు తంగెళ్లపల్లి నారాయణమ్మ విద్యార్థులకు కంపాస్ బాక్స్‌లు, స్కేల్స్, పెన్సిల్స్ అందజేశారు. అలాగే కొత్తగా ఎన్నికైన ఏఏపిసి చైర్మన్ రమాదేవికి స్వాగతం పలుకుతూ మాజీ చైర్మన్ విజయకు వీడ్కోలు సన్మానం చేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు నాగులమీరా, సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్, రిటైర్డ్ ఆర్.ఐ. కనకయ్య, ఉపాధ్యాయులు సతీష్, పార్వతి, కమల, వార్డు సభ్యులు కందుల భాస్కర్, గుండె తిరపయ్య, మోత్కురి లక్ష్మయ్య, విద్యార్థినులు, విద్యార్థులు, ఆఫీస్ సబార్డినేట్ రఫీ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
Admin
Studio18 News