Sunday, 25 January 2026 06:09:56 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

కాంగ్రెస్ కార్పొరేటర్ వేధింపులకు బీఆర్ఎస్ నాయకుడు బలి

కాంగ్రెస్ కార్పొరేటర్ అరాచకాలకు బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు (BRS Leader) బలయ్యాడు. అడిగినంత డబ్బు ఇవ్వలేదని కక్షగట్టిన అధికార పార్టీ కార్పొరేటర్

Date : 29 May 2025 12:30 PM Views : 468

Studio18 News - TELANGANA / HYDERABAD : వెంగళరావునగర్, మే 29: కాంగ్రెస్ కార్పొరేటర్ అరాచకాలకు బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు (BRS Leader) బలయ్యాడు. అడిగినంత డబ్బు ఇవ్వలేదని కక్షగట్టిన అధికార పార్టీ కార్పొరేటర్ బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసి బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడి ఇంటిని కూల్చేయించాడు. మనస్థాపానికి గురైన బాధితుడు తన మూడంతస్తుల ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన మృతుడి బంధువులు, స్థానికులు అర్ధరాత్రి హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. బాధితులు కథనం ప్రకారం బోరబండ ఎస్ఆర్టీ నగర్‌కు చెందిన బీఆర్ఎస్ మైనారిటీ విభాగం నాయకుడు, మెడికల్ షాపు నిర్వాహకుడు మొహ్మద్ సర్ధార్ (35) బస్తీలో తన ఇంటిని నిర్మించుకుంటుండగా కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ బెదిరింపులకు దిగాడు. డబ్బు ఇవ్వకుంటే.. జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసి నీ ఇంటిని కూల్చివేయిస్తానని ధమ్కీ ఇచ్చాడు. ఇటీవల బల్దియా సిబ్బంది చేరుకుని ఆ ఇంటి స్లాబ్, గోడలకు రంధ్రాలు చేసి ధ్వంసం చేశారు. కష్టపడి సంపాదించి అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నప్పటికీ భార్యాబిడ్డలకు ఇప్పుడు ఇల్లు లేకుండా పోయిందన్న దిగులు చెందేవాడు. తీవ్ర మనస్తాపానికి గురైన బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు సర్ధార్ బుధవారం రాత్రి తన ఇంటి మూడో అంతస్తుపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. Sardhar 1 బోరబండ పోలీస్ స్టేషన్ ముట్టడించిన జనం ఈ ఘటనతో జనం రగిలిపోయారు. కట్టలు తెంచుకున్న ఆవేశంతో బోరబండ పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ దౌర్జన్యాన్ని..అరాచకాల్ని నిరసిస్తూ అర్ధరాత్రి మృతుడి బంథువులు, స్థానికులు గుమిగూడి బోరబండ పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. అరాచకాల అధికార పార్టీ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ను అరెస్ట్ చేయాలి అంతులేని అరాచకాలు, దౌర్జన్యాలు సాగిస్తున్న అధికార పార్టీ కార్పొరేటర్ బాబాఫసియుద్దీన్ కు అడిగినంత డబ్బు ఇవ్వలేదన్న అక్కసుతో బీఆర్ఎస్ నాయకుడు సర్దార్ ప్రాణాలు బలిగొన్నాడని ఆరోపించారు. మామూళ్ళ కోసం కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపులు తీవ్రతరమయ్యాయని వాపోయారు. తక్షణమే కార్పొరేటర్ బాబాఫసియుద్దీన్ ను అరెస్ట్ చేయాలని.. కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని ఆందోళన చేశారు. పోలీసు ఉన్నతాధికారులు చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పారు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :