Sunday, 29 March 2026 05:21:39 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్

Date : 06 February 2026 07:23 PM Views : 85

Studio18 News - TELANGANA / HYDERABAD : సిగాచీ పరిశ్రమ మృతుల కుటుంబాలకు రూపాయి పరిహారం ఇవ్వలేదన్న హరీశ్ రావు రూ.1 కోటి పరిహారం ఇచ్చినట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానన్న హరీశ్ రావు సిగాచీ పరిశ్రమ మాత్రమే రూ.25 లక్షలు ఇచ్చిందన్న మాజీ మంత్రి సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు ఈ ప్రభుత్వం రూ.1 కోటి పరిహారం ఇచ్చినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. బాధిత కుటుంబాలకు సిగాచీ పరిశ్రమ మాత్రమే రూ.25 లక్షల చొప్పున ఇచ్చిందని అన్నారు. సిగాచీ కంపెనీలో 54 మంది ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇస్తామని చెప్పి రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. హామీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి పురుషుల బస్సు ఛార్జీలను రెండింతలు చేశారని ఆరోపించారు. రెండేళ్ల తర్వాత మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, తాను మంత్రిగా వస్తానని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బులు పంపిణీ చేస్తే తీసుకోవాలని, ఓటు మాత్రం కారు గుర్తుకు వేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డివి వట్టి మాటలేనని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ అని ధ్వజమెత్తారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :