Studio18 News - TELANGANA / HYDERABAD : న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. డ్రగ్స్ వినియోగించకుండా పలు పబ్ లు, బార్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్ లో పలు బార్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నార్కోటిక్, ఎక్సైజ్, మాదాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో సోదాలు జరిపారు. గంజాయి సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇటు హైదరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు విధించారు.
మద్యం దుకాణాలు, కొనుగోళ్లపై ప్రత్యేక ఆదేశాలు.. మరోవైపు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో మద్యం దుకాణాలు, కొనుగోళ్లపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31న మద్యం దుకాణాలను అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచవచ్చని ప్రకటించింది. ఇక బార్లు, రెస్టారెంట్లను అర్థరాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచవచ్చని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో న్యూఇయర్ ను లిక్కర్ పార్టీతో వెల్ కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు మద్యం ప్రియులు.
ఆ పబ్ లకు నో పర్మిషన్.. మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్న న్యూఇయర్ వేడుకలకు సంబంధించి ఇప్పటికే మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేశారు. పబ్ లు, బార్లలో ఈవెంట్లకు సంబంధించి.. అనుమతి ఉన్న వారు మాత్రమే న్యూఇయర్ వేడుకలు నిర్వహించాలన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 34 పబ్స్ ఉంటే.. అందులో 4 పబ్ లకు సంబంధించి ఈసారి నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు అనుమతులు నిరాకరించారు. గత ఏడాదిలో చోటు చేసుకున్న పరిణామాలు, కస్టమర్ల పట్ల వ్యవహరించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి 4 పబ్ లకు అనుమతి నిరాకరించినట్లు చెప్పుకోవచ్చు. ఆ పబ్ లలో గొడవలు జరిగాయి. కస్టమర్లతో వాటి సిబ్బందిలో దురుసుగా ప్రవర్తించారు. గొడవలు జరిగాయి. పార్కింగ్ విషయంలో న్యూసెన్స్ క్రియేట్ చేశాయి. ఈ కారణాలతో ఈసారి న్యూ ఇయర్ వేడుకల నిర్వహణకు ఆ పబ్ లకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రతి ఏడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాత్రి 12 గంటల తర్వాత కూడా బార్ లు నడుపుకునే అవకాశం ఇస్తోంది ప్రభుత్వం. ఒంటి గంటకు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఈసారి కూడా అదే తరహా అనుమతులు ఇచ్చారు. అయితే, న్యూసెన్స్ లేకుండా, పరిమితికి లోబడి మాత్రమే కస్టమర్లను పిలిపించుకోవాలంది. న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మాత్రం నిర్వాహాకులదే బాధ్యత అని పోలీసులు తేల్చి చెప్పారు. హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో (హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ) ఈవెంట్స్ జరగబోతున్నాయి. ప్రధానంగా సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో పెద్ద సంఖ్యలో పబ్స్ ఉన్నాయి. ఈవెంట్స్ కూడా జరగబోతున్నాయి. మ్యూజికల్ ఈవెంట్లలో పాల్గొనేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు వస్తుంటారు. దాంతో ప్రత్యేక నిఘా ఉండబోతోంది. పోలీసులు విధించిన సమయంలోపే దరఖాస్తులు చేసుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తు చేసుకుంటే అనుమతి నిరాకరిస్తారు.
Admin
Studio18 News