Studio18 News - TELANGANA / MANCHERIAL : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులను కొనసాగిస్తూ కార్యాలయాలలో పెండింగ్ ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో నిర్వహిస్తున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పూర్తిగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు
Admin
Studio18 News