Studio18 News - తెలంగాణ / : ఫార్మా సిటీకి సంబంధించి పట్టా భూముల జోలికి వెళ్లొద్దని తాను గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించానని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. వికారాబాద్ కలెక్టర్ మీద దాడి ఘటనపై ఆమె స్పందించారు. ఈ మేరకు వికారాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఫార్మా సిటీపై పంతాలకు, పట్టింపులకు వెళ్లవద్దని సీఎంకు గతంలోనే సూచించినట్లు చెప్పారు. ఫార్మా సిటీ తనకు వద్దని రైతులు గతంలోనే ధర్నా చేశారన్నారు. ఆ ధర్నాకు తాను మద్దతుగా వెళ్లినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారన్నారు. ప్రాణాలు పోయినా సరే ఫార్మా సిటీని అడ్డుకుంటామని రైతులు చెప్పారన్నారు. ప్రభుత్వ భూముల్లో ఏవైనా పరిశ్రమలు పెట్టుకోవాలని రైతులు స్పష్టం చేశారని తెలిపారు. తమ భూములు కోల్పోతే జీవనాధారం కోల్పోతామని వారు ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. ప్యాకేజీ ఎంత ఇచ్చినా భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారన్నారు
Also Read : అందుకే స్టేజ్ పై ఆ మాట అన్నాను: హీరో విష్వక్సేన్!
Admin
Studio18 News