Tuesday, 03 December 2024 04:46:04 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

కొడంగల్ రైతులు జైల్లో ఉంటే... మంత్రులు లండన్‌లో ఏం చేస్తున్నారో చూడండి: కేటీఆర్

16 మంది రైతులు జైల్లో ఉన్నారన్న కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఆగ్రహం సీఎం మహారాష్ట్ర ఎన్నికల్లో బిజీగా ఉన్నారన్న కేటీఆర్

Date : 13 November 2024 04:40 PM Views : 50

Studio18 News - తెలంగాణ / : కొడంగల్ రైతులు జైల్లో ఉన్న ఈ సమయంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లండన్‌లో ఏం చేస్తున్నారో చూడండంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఫార్మా సిటీ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యపు భూసేకరణను నిరసిస్తూ 16 మంది రైతులు జైల్లో ఉన్నారని, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న పని చూడండంటూ ఎక్స్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ బస్సులో పౌరాణిక పాత్రలను ఇమిటేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు లండన్‌లో ఉన్నారని, కానీ రైతులు మాత్రం జైల్లో ఉన్నారని ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా పోరాటం ఫార్మా విలేజ్‌ను నిరసిస్తూ ఆరు నెలలుగా కొడంగల్ నియోజకవర్గంలో రైతులు ఉద్యమిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ప్రజల తిరుగుబాటులో ఎవరి కుట్రా లేదన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ముచ్చ‌ర్ల‌లో ఫార్మా సిటీ రద్దు అని సీఎం చెప్పగానే భూములు ఇచ్చిన రైతులు సంతోషపడ్డారన్నారు. తమ భూములు తమకు ఇస్తారని రైతులు సంతోషపడ్డారన్నారు. కానీ నెల రోజుల్లోనే ఫార్మా సిటీ రద్దు అటుంచి... ఫార్మా విలేజ్ పెడతామని చెప్పడంతో వారు ఆందోళలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఆనవాళ్లు ఉండకూడదన్న ఉద్దేశంతో ఫార్మా సిటీ పేరును ఫార్మా విలేజ్‌గా మార్చారని ఆరోపించారు. ఫార్మా రంగాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ ఫార్మా యూనివర్సిటీ తేవాలని తాము 14 వేల ఎకరాలు సేకరించామని తెలిపారు. ఏమీ తెలియకుండానే తాము ఇదంతా చేయలేదన్నారు. తెలంగాణను ఫార్మా రంగంలో లీడర్ చేయాలని భావించామని... ఫార్మా సిటీని అత్యున్నతంగా తీర్చిదిద్దేందుకు అధికారులు విదేశాల్లో కూడా పర్యటించినట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫార్మా సిటీ పూర్తి చేద్దామని తాము భావించామని, అలాగే భూములిచ్చిన రైతులకు ఫ్లాట్లు కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేశామన్నారు. అలాంటి ఫార్మా సిటీని వదిలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తుగ్లక్, మూర్ఖ నిర్ణయాలతో అందరినీ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. అందుకే ప్రజలు తిరగబడుతున్నారని తెలిపారు.

Also Read : ప్రధాని మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించిన నితీశ్ కుమార్

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :