Wednesday, 10 December 2025 02:36:10 AM
# Raashi Singh: కాలేజీ రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడ్డాను: హీరోయిన్ రాశీ సింగ్ # DK Shivakumar: కర్ణాటకలో మరోసారి తెరపైకి సీఎం పదవి వివాదం.. సిద్ధూ కుమారుడి వ్యాఖ్యలపై డీకే ఏమ‌న్నారంటే..! # Narendra Modi: ‘ఇండిగో’ సంక్షోభంపై స్పందించిన మోదీ.. ఏమన్నారంటే..! # Jasprit Bumrah: బుమ్రా ముందు అరుదైన రికార్డు.. ఒక్క వికెట్ తీస్తే చరిత్రే! # IND vs SA | తొలి టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. సంజూకు నో ఛాన్స్..! # Sonia Gandhi: సోనియాగాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు # IND vs SA | మరోసారి గిల్, సూర్య ఫ్లాప్.. బౌండరీలతో చెలరేగుతున్న అభిషేక్..! # Team India Squad | శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత స్క్వాడ్‌లో అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్లు..! # Nayanam Trailer | వ‌రుణ్ సందేశ్ హీరోగా జీ5 వెబ్ సిరీస్.. ఆస‌క్తిక‌రంగా ‘న‌యనం’ ట్రైల‌ర్ # Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. యువ జంట దుర్మరణం # Actress | ఏంటి.. ఆ హీరోయిన్ పెళ్లి కూడా ర‌ద్దైందా.. అస‌లు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ..! # UIDAI: ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. వచ్చేసింది కొత్త యాప్ # Sunaina Yella | పాపులర్ అరబ్‌ యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్‌ పెళ్లి.. క్రేజీ టాక్‌లో నిజమెంత..? # Anthony Albanese: పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం.. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య # Deepika Padukone | విక్కీ కౌశల్‌కు జోడీగా దీపికా పదుకొణె? ‘మహావతార్’లో పవర్ ఫుల్ రోల్! # Indian Cinema 2025 : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ కలెక్షన్లు రాబట్టిన టాప్ సినిమాల జాబితా ఇదే # Prabhas: ప్రభాస్ పర్యటన వేళ జపాన్ లో భూకంపం.. అభిమానుల్లో ఆందోళన.. మారుతి స్పందన # Akhanda 2 | ‘అఖండ 2’ రాకతో చిన్న సినిమాలకు షాక్ .. విడుదల తేదీల్లో పెద్ద గందరగోళం # Vijay: తమిళనాడుకే పరిమితం కాదు.. పుదుచ్చేరి ప్రజలకు కూడా అండగా ఉంటా: విజయ్ # Varanasi | మహేష్ బాబుకి జక్కన్న టార్చర్ స్టార్ట్… ‘వారణాసి’ కోసం ఏకంగా 5 గెటప్స్!

ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

Date : 23 June 2025 05:25 PM Views : 491

Studio18 News - TELANGANA / : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు పురోగమిస్తున్న కొద్దీ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో జరిగిన పలు ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసి, సమాచారం సేకరించి, కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులకు కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అప్పటి ఉన్నతాధికారుల పాత్రపై కూడా సిట్ దృష్టి సారించింది. సమాచారం ప్రకారం, 2018 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అప్పటి ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన ప్రణీత్ రావు, ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా వ్యవహరించిన రాధాకిషన్‌రావుకు చేరవేసేవారని తెలుస్తోంది. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌ రావు ఆదేశాల మేరకే టాస్క్‌ఫోర్స్‌ బృందాలు రంగంలోకి దిగి, ఈ ఆపరేషన్లు నిర్వహించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే, హైదరాబాద్‌లోని ప్యారడైజ్‌ వద్ద భవ్య ఆనంద్‌ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన రూ.70 లక్షల నగదును ఫోన్ ట్యాపింగ్ ద్వారా పొందిన సమాచారంతోనే టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సీజ్ చేశారని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా, తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందన్‌రావు బంధువులకు చెందిన సుమారు కోటి రూపాయల నగదును కూడా ట్యాపింగ్ సమాచారం ఆధారంగానే స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీపీ రాధాకిషన్‌రావు, ఆయన బృందం ఈ మొత్తాన్ని సీజ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ఇదే తరహాలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్‌కు సమాచారం అందింది. నల్గొండ జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్‌ నాయకుల అనుచరుల నుంచి సుమారు మూడున్నర కోట్ల రూపాయల నగదును కూడా అక్రమ నిఘా ద్వారా పొందిన సమాచారంతోనే అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :