Sunday, 29 March 2026 05:17:23 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Sajjanar: బంగారం ధర పెరగడంతో స్నాచింగ్‌లు ఎక్కువయ్యాయా?.. క్లారిటీ ఇచ్చిన సజ్జనార్

Date : 29 January 2026 07:06 PM Views : 123

Studio18 News - TELANGANA / HYDERABAD : హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోయాయని ప్రచారం జరుగుతోందన్న సజ్జనార్ ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టీకరణ సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోయాయని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. బంగారం ధరలు పెరిగినందున రాష్ట్రంలో అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్ నగరంలో మకాం వేశాయని, చైన్ స్నాచింగ్‌లు ఎక్కువయ్యాయని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరించని వార్తలను నమ్మవద్దని, భయపెట్టే పోస్టులను ఫార్వార్డ్ చేయవద్దని సూచించారు. భయాందోళనలు సృష్టించేలా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరం పూర్తిగా సురక్షితమని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని సూచించారు. ఏదైనా అనుమానం వస్తే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. "నిశ్చింతగా ఉండండి. మీ భద్రత మా బాధ్యత" అని పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :