Studio18 News - TELANGANA / MANCHERIAL : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా Bellampalli పట్టణంలోని 28వ వార్డు అభివృద్ధి కోసం చైర్‌పర్సన్ Dawa Swathi–రమేష్, 28వ వార్డు కౌన్సిలర్ Chippa Archana–మనోహర్ వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డోకూరి పులమ్మ, కల్లూరి మల్లేష్, అలీ, మంతెన మోహన్, గద్దెల కుమార్, కుడుదుల చంద్రయ్య, కుడుదుల శ్రీనివాస్, కన్నయ్య, మంతెన సుమలత, ఇప్ప సరోజ తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే వార్డులోని మహిళలు, యువత, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో నిర్వాహకులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Admin
Studio18 News