Studio18 News - TELANGANA / JAGTIAL : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మెట్‌పల్లి పట్టణం మరియు మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం ₹65,07,540 (ఆరవై ఐదు లక్షల ఏడు వేల ఐదు వందల నలభై రూపాయలు) విలువగల 65 కళ్యాణ లక్ష్మి – షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి – షాది ముబారక్ పథకాల ద్వారా ఆడపిల్లల వివాహ సమయంలో కుటుంబాలపై పడే ఆర్థిక భారం తగ్గి, పేద కుటుంబాలకు పెద్ద సహాయంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, అధికారులు, గ్రామ–పట్టణ ప్రజలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
Admin
Studio18 News