Studio18 News - TELANGANA / RANGAREDDY : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని ఏల్గొండ గూడ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి దాతల సహాయం మరువలేనిదని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లేశ్వర్ తెలిపారు. గురువారం గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు మామిడిపల్లి సతీష్ విద్యార్థుల కోసం కంప్యూటర్ సిస్టమ్ మరియు టేబుల్‌ను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ శివలీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మల్లేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా దాత మామిడిపల్లి సతీష్‌ను గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో గ్రామస్తులు శ్రీనివాస్, శేఖర్ రెడ్డి, రాఘవేందర్, పవన్ గౌడ్, శ్రీనివాసచారి, శ్రీశైలం గౌడ్, కృష్ణమూర్తి, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Admin
Studio18 News