Sunday, 29 March 2026 05:25:39 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Renuka Chowdary: మహిళల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు... స్పందించిన రేణుకా చౌదరి

Date : 19 January 2026 06:43 PM Views : 70

Studio18 News - TELANGANA / HYDERABAD : మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరని ప్రశ్నించిన రేణుకా చౌదరి మహిళల విషయంలో తప్పుడు వార్తలు రాయడం సరికాదన్న కాంగ్రెస్ నాయకురాలు ఖమ్మంలో ఈసారి పోటీ చేస్తానన్న రేణుకా చౌదరి మహిళల దుస్తులపై జరుగుతున్న వివాదంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి స్పందించారు. కొద్ది రోజుల క్రితం నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తులపై వ్యాఖ్యలు చేయడం, వాటిపై సినీ నటి అనసూయ వంటి వారు స్పందించడంతో మహిళల దుస్తుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ఎక్కువ మంది శివాజీకి మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళల దుస్తులపై రేణుకా చౌదరి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పడానికి మీరెవరని ఆమె ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల వేదికగా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మహిళలను అణగదొక్కాలని ఎవరు ప్రయత్నించినా వారికి తగిన గుణపాఠం చెబుతామని ఆమె అన్నారు. ఇటీవల ఒక మహిళా అధికారిపై మీడియాలో వచ్చిన వార్తలపై కూడా ఆమె తీవ్రంగా స్పందించారు. మహిళల విషయంలో తప్పుడు వార్తలు రాయడం ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై ఆమె స్పందిస్తూ, ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పేదల హక్కులను కాలరాసే అధికారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేదని అన్నారు. ఖమ్మంలో ఈసారి పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. తన గెలుపును ఆపే దమ్ము కేటీఆర్‌కు ఉందా అని సవాల్ విసిరారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :