Saturday, 14 December 2024 06:32:22 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Harish Rao: పోలీసుల అత్యుత్సాహం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగిందో చూశాం: హరీశ్ రావు

Date : 23 September 2024 03:42 PM Views : 35

Studio18 News - తెలంగాణ / : అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు... పోలీసుల అత్యుత్సాహం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందో మనం చూశాం... పోలీసు అధికారులు చట్టాలకు లోబడి పని చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో గూండాయిజం, అత్యాచారాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలోనే 2 వేలకు పైగా అత్యాచారాలు జరిగాయని విమర్శించారు. శాంతిభద్రతల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. హైదరాబాద్, దేవరకద్రలో నిన్న ఒక రోజే రెండు అత్యాచారాలు జరిగాయన్నారు. కానీ పోలీసులు ప‌ట్టించుకోవ‌డం లేదని ఆరోపించారు. ఇలాంటి కేసుల్లో నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై నిన్న రాత్రి కాంగ్రెస్ గూండాలు దాడులు చేశారని ఆరోపించారు. ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాత్రి సమయంలో ఇంటి ముందు పటాకులు పేల్చి, తలుపులు తీయించి మరీ దాడులు చేయడమేమిటన్నారు. ఈ దాడికి సంబంధించి విజువల్స్ కూడా ఉన్నాయన్నారు. ఈ ఘటనపై వెంటనే డీజీపీ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని, వీటి నుంచి డైవర్ట్ చేసేందుకు రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో హైడ్రామాకు తెరలేపారని విమర్శించారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటపొలాలు ఎండిపోతున్నాయని, మరోవైపు లక్షలాది మంది డెంగ్యూ, చికెన్ గున్యాతో బాధపడుతున్నారని, వీటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :