Studio18 News - TELANGANA / MANCHERIAL : విలేకరిపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ Bharat Rashtra Samithi నాయకులు Kannepalli మండల కేంద్రంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్కే-24 రిపోర్టర్ చెండే చంద్రశేఖర్ కన్నెపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో నిర్మిస్తున్న ప్రహరీ గోడ పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నాయని, అక్రమాలు జరుగుతున్నాయని వార్త ప్రచురించారని తెలిపారు. ఆ వార్త రాసిన కారణంగా కాంగ్రెస్ నాయకులు ఆయనపై దాడి చేశారని ఆరోపించారు. దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో Bharat Rashtra Samithi నాయకులు ఆకుతోట రాజన్న (మాజీ పాక్స్ చైర్మన్), గువ్వల రవి (సర్పంచ్), నియోజకవర్గ యువజన అధ్యక్షుడు జిల్లెల్ల మహేష్ గౌడ్, బండ గణేష్, ఎన్న రవి, చి. రాములు, తలండి అశోక్, బెడ్డల శ్రీనివాస్, వడుగురి బాపు, బెలాజీ, ఎ. రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News