Studio18 News - TELANGANA / RAJANNA SIRCILLA : రాష్ట్ర ప్రజలందరూ మంచి వర్షాలతో, ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వర్దవెళ్లి శ్రీ దత్తాత్రేయ ఆలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి శ్రీ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మిడ్ మానేరు ప్రాజెక్ట్ రావడం వల్ల దత్తాత్రేయ స్వామి ఆలయం చుట్టూ నీరు వచ్చిందని.. దర్శనం కోసం వచ్చే భక్తులకు బోట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కేవలం జయంతి రోజు మాత్రమే కాకుండా శాశ్వతంగా బోటు సౌకర్యం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు సంవత్సరాల ప్రజా పాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. ప్రజాహితం కోరే వారందరికీ ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్తున్నారన్నారు.రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి గ్రామాల్లో కూడా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.
Admin
Studio18 News