Studio18 News - TELANGANA / NIRMAL : నిర్మల్ పట్టణంలోని SVR ఆసుపత్రి అధినేత డాక్టర్ సంతోష్ రాజ్‌పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు తీవ్రంగా స్పందించారు. మంగళవారం బాధితుడిని పరామర్శించిన ఆయన, ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులపై దాడులు చేయడం అమానుషమని, ఇటువంటి ఘటనలు సమాజానికి తగవని కూచాడి శ్రీహరి రావు అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. పోలీసులు త్వరితగతిన నిందితులను అరెస్ట్ చేయడం అభినందనీయమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూచాడి శ్రీహరి రావు తో పాటు నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీంరెడ్డి, నిర్మల్ ఆత్మ కమిటీ చైర్మన్ కొండ్రు రాంరెడ్డి, జిల్లా అధికారి ప్రతినిధి కొట్టే శేఖర్, పుప్పాల రాజేశ్వర్, అమెడ కిషన్, దేవరకోట చైర్మన్ అమెడ శ్రీనివాస్, డైరెక్టర్లు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Admin
Studio18 News