Sunday, 08 February 2026 09:38:22 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

నుమాయిష్‌ ప్రారంభం వాయిదా..!

మాజీ ప్రధాని సంతాప దినాల కారణంగా జనవరి 3కు వాయిదా

Date : 30 December 2024 01:58 AM Views : 647

Studio18 News - TELANGANA / HYDERABAD : హైదరాబాద్‌లోనే అతి పెద్ద ఎగ్జాబిషన్‌.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించే నుమాయిష్.. ఈ ఎగ్జిబిషన్‌ అంటే హైదరాబాద్‌ వాసులకు మాత్రమే కాదు.. జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. ప్రజలకు నచ్చిన, అరుదైన వస్తువులు దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన కళాఖండాలు కూడా నుమాయిష్‌లో కొలువుదీరుతాయి. పలు పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థల స్టాళ్లు, ఫుడ్‌ కోర్టులు, సందర్శకులను ఆకట్టుకునేందుకు అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ వంటి అనేక ప్రత్యేక ఆకర్షణలు అందుబాటులో ఉంటాయి. అయితే, ప్రతి సంవత్సరం ఈ నుమాయిష్‌ జనవరి 1న ప్రారంభమై 46 రోజుల పాటు, అంటే ఫిబ్రవరి 15 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. కానీ, ఈ యేడు నుమాయిష్‌ ప్రారంభం వాయిదా పడింది. తిరిగి ఎప్పుడు ప్రారంభం కానుందంటే.. హైదరాబాద్‌లో నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరగాల్సిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) బుధవారం (జనవరి 1) ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఈ కార్యక్రమాన్ని రెండు ఆలస్యంగా అంటే, జనవరి 3న ప్రారంభించనున్నారు. మాజీ ప్రధాని సంతాప దినాల కారణంగా జనవరి 3కు వాయిదా వేసింది. జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ జరుగనుంది. 84వ అల్ ఇండియా ఎగ్జిబిషన్ సొసైటీ, నుమాయిష్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ముఖ్య అతిథిగా పాల్గొని నుమాయిష్ ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించనున్నట్టు సమాచారం. షెడ్యూల్ ప్రకారం, నుమాయిష్‌ జనవరి 1న ప్రారంభమై 46 రోజుల పాటు, అంటే ఫిబ్రవరి 15 వరకు జరగాల్సి ఉంది. పారిశ్రామిక ప్రదర్శన నిర్వహణలో ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షులు, మంత్రి శ్రీధర్‌ బాబు పర్యవేక్షణలో ఉపాధ్యక్షుడు నిరంజన్‌, కార్యదర్శి సురేందర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి మోహన్‌, కోశాధికారి డాక్టర్‌ ప్రభాశంకర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు 2500 స్టాళ్ల నిర్మాణానికి నిర్వాహకుల నుంచి దరఖాస్తులను స్వీకరించడంతో స్టాళ్ల కేటాయింపు చివరి దశకు చేరుకుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :