Sunday, 08 February 2026 11:24:13 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Renu Agarwal Murder | కూకట్‌పల్లి హత్య కేసు.. జార్ఖండ్‌లో నిందితుల అరెస్ట్‌

Renu Agarwal Murder | కూకట్‌పల్లిలోని స్వాన్‌ లేక్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో స్టీల్‌ వ్యాపారి రాకేశ్‌ అగర్వాల్‌ భార్య రేణు అగర్వాల్ హత్యకు గురైన సంగతి తెలి

Date : 13 September 2025 08:23 PM Views : 507

Studio18 News - TELANGANA / HYDERABAD : Renu Agarwal Murder : కూకట్‌పల్లిలోని స్వాన్‌ లేక్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో స్టీల్‌ వ్యాపారి రాకేశ్‌ అగర్వాల్‌ భార్య రేణు అగర్వాల్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ స్పెషల్‌ టీమ్‌ జార్ఖండ్‌కు వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం నిందితులిద్దరిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. రాకేశ్‌ అగర్వాల్, రేణు అగర్వాల్ ‌(50) దంపతులకు ఫతేనగర్‌లో స్టీల్‌ దుకాణం ఉంది. కుమార్తె తమన్నా ఇతర రాష్ట్రాల్లో చదువుతోంది. కుమారుడు శుభంతో కలిసి రేణు దంపతులు నివసిస్తున్నారు. స్వాన్‌ లేక్‌లోనే ఉండే రేణు బంధువుల ఇంట్లో జార్ఖండ్‌కు చెందిన రోషన్‌ తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్నాడు. అతడు జార్ఖండ్‌లోని తన గ్రామానికే చెందిన హర్ష్‌ను కొన్ని రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనికి కుదిర్చాడు. బుధవారం ఉదయం రేణు భర్త రాకేశ్, కొడుకు శుభం దుకాణానికి వెళ్లగా.. ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం ఐదింటికి భర్త, కుమారుడు ఫోన్‌ చేసినా ఆమె స్పందించలేదు. ఏడు గంటల సమయంలో రాకేశ్‌ ఇంటికొచ్చి తలుపు తట్టినా తీయకపోవడంతో ప్లంబర్‌ను పిలిపించి, వెనుక వైపు నుంచి లోపలికి పంపించి తలుపు తీయించారు. ఇంట్లోకి వెళ్లిచూడగా హాల్లో రేణు కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపు మడుగులో పడి ఉన్నారు. తల, ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హర్ష్, రోషన్‌లే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయ్యింది. రేణును నిందితులు తాళ్లతో బంధించి.. డబ్బులు, నగలు ఎక్కడున్నాయో చెప్పాలంటూ చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. అనంతరం కూరగాయల కత్తులతో గొంతు కోసి, కుక్కర్‌తో తలపై గట్టిగా కొట్టి చంపారు. ఇంట్లోని లాకర్లను బద్దలు కొట్టి అందినకాడికి డబ్బు, నగలు సూట్‌కేసులో సర్దారు. ఖాళీ చేతులతో వచ్చిన ఇద్దరూ సూట్‌కేసుతో తిరిగి వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. హత్య చేసిన అనంతరం రక్తపు మరకలతో ఉన్న దుస్తులను ఇంట్లోనే వదిలేసి స్నానం చేశారు. వేరే దుస్తులు ధరించారు. ఇంటికి తాళం వేసి రాకేశ్‌ కుటుంబానికే చెందిన స్కూటీపై పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలించారు. ఇవాళ జార్ఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :