Studio18 News - TELANGANA / SANGAREDDY : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు తమ ఇంటి పన్ను, వ్యాపార లైసెన్స్ రుసుములను వెంటనే చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి కోరారు. సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బకాయిలు చెల్లించని వారిపై మున్సిపల్ చట్టం–2019 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జరిమానాలు పడకముందే గడువులోగా చెల్లింపులు పూర్తి చేయాలని సూచించారు
Admin
Studio18 News