Studio18 News - తెలంగాణ / : కేంద్ర మంత్రి బండి సంజయ్ మానవత్వాన్ని చాటుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం సింగాపూరం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన యువతి..లారీ కింద ఇరుక్కుపోయింది. మానకొండూర్ మండలం ఖెల్లడ గ్రామానికి చెందిన యువతి దివ్య శ్రీ సింగాపూరం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ములుగు పర్యటనకు వెళ్తు ప్రమాదాన్ని చూసి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తన వాహనాన్ని ఆపారు. అటువైపు వెళుతున్న లారీలను ఆపి జాకీలు, కత్తెర తెప్పించారు. జుట్టు కత్తిరించి యువతి ప్రాణాలను కాపాడారు స్థానికులు. గాయాలపాలైన యువతిని కరీంనగర్లోని లైఫ్ లైన్ ప్రైవేట్ ఆసుపత్రికి పంపి.. చికిత్సకు అయ్యే ఖర్చును తానే చెల్లిస్తానని ఆసుపత్రి వైద్యులకు బండి సంజయ్ చెప్పారు.
Also Read : తెలుగు జాతిపై నోరు పారేసుకున్న సినీనటి కస్తూరి కోసం పోలీసుల గాలింపు
Admin
Studio18 News