Sunday, 29 March 2026 05:19:31 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Nitin Nabin: తెలంగాణలో సనాతన ధర్మంపై జరిగే దాడులను సహించేది లేదు: నితిన్ నబీన్ హెచ్చరిక

Date : 04 February 2026 06:29 PM Views : 32

Studio18 News - TELANGANA / HYDERABAD : ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఆరాటపడుతోందని ఆరోపణ హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే నోరు మెదపడం లేదని ఆగ్రహం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని విమర్శలు రాష్ట్రంలో సనాతన ధర్మం మీద జరిగే దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హెచ్చరించారు. మహబూబ్ నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన 'విజయ సంకల్ప్' సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఆరాటపడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా నోరు మెదపడం లేదని, ఆలయాల భూములు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎందరో పోరాడారని అన్నారు. హైదరాబాద్ విముక్తి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. వక్ఫ్ బోర్డును బలోపేతం చేసేందుకు చూస్తోందని అన్నారు. బలహీనవర్గాలకు న్యాయం జరగలేదని, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో ప్రభుత్వం కోత విధిస్తోందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. రైతు భరోసా, రుణమాఫీ, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదని అన్నారు. ఎస్సీలు, ఆదివాసీలు, బీసీలను తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు, బిల్లుల మంజూరుకు ఆర్ఆర్ ట్యాక్స్ చెల్లించవలసి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి, కమీషన్ల ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని అన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తోందని, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో రైల్వే పనులకు రూ.5,400 కోట్లకు పైగా కేటాయించామని, మూడు హైస్పీడ్ రైల్ రైళ్లను ఇచ్చామని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం పట్ల ఆదరణ పెరుగుతోందని అన్నారు. ఈయూతో ఒప్పందం చేసుకుని దేశాభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :