Studio18 News - TELANGANA / JANGOAN : జనగామ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం కొసాగుతుంది. దేవరుప్పుల మండలం,దేవరుప్పుల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ బలపరచిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఏల సుందర్ నామినేషన్ వేశారు. ముందుగా స్థానికంగా ఉన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుటుంబ సభ్యలు అశీర్వాదం తీసుకోని.. ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి డప్పు చప్పుళ్లతో భారీ ర్యాలీగా నామినేషన్ దాఖలు చేసేందుకు దేవరుప్పుల మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయానికి బయలుదేరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్లా సుందర్ రాంరెడ్డి,మాజీ మండల అధ్యక్షుడు బస్వ మల్లేష్,మండల,గ్రామ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధులు,నాయకులు,యువజన నాయకులు,మహిళా నాయకురాళ్లు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Studio18 News