Studio18 News - TELANGANA / HYDERABAD : బీసీ రిజర్వేషన్ల 42 శాతం అమలు కోసం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ నేతృత్వం వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. సత్యనారాయణ మాట్లాడుతూ రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా బాధ్యతను కేంద్రం, కోర్టులపై నెట్టేసిందని విమర్శించారు. కేంద్రం, కోర్టుల వైఖరి తెలియకుండా ప్రభుత్వం హామీలు ఇచ్చిందా లేక ఇవ్వడానికి ఇష్టపడలేదా అని ప్రశ్నించారు. ట్రిపుల్ టెస్ట్ అమలు ఆలస్యమవడం, రాజకీయ వర్గాల ప్రయోజనాల కోసం న్యాయం జరగకపోవడం వంటి అంశాలు ఈ పరిస్థితికి కారణమని తెలిపారు సత్యనారాయణ.
Admin
Studio18 News