Studio18 News - తెలంగాణ / : పోలీసు అధికారులను మాజీమంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడితే జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఏపీలో ఏం జరుగుతుందో చూస్తున్నారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. అన్యాయం చేసే వారిని విడిచి పెట్టేది లేదన్నారు. కార్యకర్తలను ఇబ్బంది పెడితే వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు హరీశ్ రావు. ”పిటిషన్లు ఇస్తే మా సోదరి సునీతమ్మ ఇంటిపై దాడి జరిగింది. మేము అందరం అక్కడికి వెళ్లాం. దరఖాస్తు ఇస్తే తిరిగి మన మీదే కేసు పెడుతున్నారు. ఈ సందర్భంగా చెబుతున్నా.. డీఎస్పీలు, ఎస్పీలు, సీనియర్ అధికారులు.. ఆంధ్రప్రదేశ్ లో ఏమైందో చూస్తున్నారు.. మీరు అన్యాయంగా కేసులు పెట్టినా, అక్రమంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించినా.. మా వాళ్లను ఇబ్బంది పెడితే తస్మాత్ జాగ్రత్త.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం. గ్యారెంటీగా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. మీ సంగతి చెబుతాం. ఎవరు అన్యాయం చేసినా విడిచిపెట్టం. రాసి పెట్టుకుంటున్నాం. తప్పకుండా ఏ అధికారి అయినా అమర్యాదగా ప్రవర్తించినా, అన్యాయంగా వ్యవహరించినా.. మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే.. వడ్డీతో సహా చెల్లిస్తాం. జాగ్రత్త” అని హెచ్చరించారు హరీశ్ రావు. ”సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నా. మూసీ సమస్యలపై పాదయాత్రకు నేను సిద్ధమే. హైదరాబాద్, నల్గొండలో ఎక్కడైనా పాదయాత్రకు నేను రెడీ. కేసీఆర్ రైతులు సీఎం అయితే, రేవంత్ రెడ్డి బూతుల సీఎం. పాలనను గాలికొదిలి సీఎం, మంత్రులు హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారు. కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు కుట్ర చేస్తోంది. మూసీ ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్, టీడీపీ పాలనే కారణం” అని హరీశ్ రావు మండిపడ్డారు.
Also Read : విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..
Admin
Studio18 News