Sunday, 15 March 2026 10:21:17 AM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

Raghunandan Rao: కొండా సురేఖ మీద అభ్యంతరకర పోస్ట్‌పై తీవ్రంగా స్పందించిన రఘునందన్ రావు

Date : 01 October 2024 05:32 PM Views : 491

Studio18 News - TELANGANA / : మంత్రి కొండా సురేఖ మీద సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. సురేఖపై ట్రోలింగ్ చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలే అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సురేఖను ట్రోలింగ్ చేసిన వివరాలు సేకరించి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. తన వల్ల కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ ఇలాంటి వారిని జైలుకు పంపించే వరకు తమ్ముడిగా అండగా ఉంటానన్నారు. అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ఈ అంశంపై స్పందించి సోషల్ మీడియాను కంట్రోల్ చేసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకున్న వారే ఇలాంటి ట్రోలింగ్ చేశారని మండిపడ్డారు. కొండా సురేఖపై ట్రోలింగ్ జరగడంపై హరీశ్ రావు ఒక ట్వీట్ పెట్టి వదిలేయడం కాదని, క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. అధికారిక కార్యక్రమంలో ఓ మంత్రిని గౌరవపూర్వకంగా సన్మానిస్తే ఇంత దారుణంగా పోస్టులు పెట్టడమేమిటని నిలదీశారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సందర్భంగా వేదికపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి సురేఖ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎంపీగా తాను ఉన్నానని గుర్తు చేశారు. వేలాదిమంది సమక్షంలో ఈ కార్యక్రమం జరిగిందని, ఇలాంటి కార్యక్రమాన్ని అభ్యంతరకరంగా చూపించడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత చాలామందిని హైర్ చేసుకొని సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని, ఇలాంటి తప్పుడు రాతలు, వెకిలి చేష్టలు మానుకోవాలని హితవు పలికారు. ముఖ్యంగా మహిళా నాయకులను కించపరిచే ప్రయత్నం చేస్తే తప్పకుండా మూల్యం చెల్లించవలసి వస్తుందని కేటీఆర్‌ను హెచ్చరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :