Studio18 News - TELANGANA / HYDERABAD : హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ చేసి, ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయ పండితులు వేదమంత్రోచ్ఛారణల నడుమ ఎల్లమ్మ తల్లికి కుంకుమార్చన చేశారు. అమ్మవారి మూలవిరాట్టును యాపిల్స్, వివిధ రకాల సువాసనభరితమైన పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఈ ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు కనువిందు చేశారు. ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొనేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పర్యవేక్షించారు.
Admin
Studio18 News