Studio18 News - తెలంగాణ / : కార్తిక సోమవారం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకొని గోపూజ ను చేశారు. పూజల తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ కు అద్దాల మండపంలో ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న కుల సర్వేకు అందరూ సహకరించాలని, ఈ సర్వే భవిష్యత్తు ప్రణాళికకు అభివృద్ధికి తీసుకుంటున్న సమాచారంగా ఆయన వ్యాఖ్యానించారు. కులగనల గురించి,బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదన్నారు. కేటిఆర్ అనుభవిస్తున్న పదవుల్లో ఒక్కటైన ఎస్సీలకు, బీసీలకు ఇచ్చి తర్వాత మాట్లాడాలని హితవు పలికారు. ఇలాంటి సర్వేను దేశవ్యాప్తంగా నిర్వహించాలని, ఈ విషయంపై బిఆర్ఎస్, బిజెపి పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.
Also Read : కాంగ్రెస్‌ను ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు: జగదీశ్ రెడ్డి
Admin
Studio18 News