Tuesday, 03 December 2024 05:16:54 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌కు నివేదిక అందించిన కవిత

బీసీ కులగణన గురించి 35 పేజీల వినతిపత్రం ఇచ్చిన కవిత కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని కవిత డిమాండ్ డెడికేటెడ్ కమిషన్ స్వతంత్రంగా పని చేయాలన్న కవిత

Date : 25 November 2024 03:37 PM Views : 53

Studio18 News - తెలంగాణ / : బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సిద్ధం చేసిన 35 పేజీల నివేదికను కమిషన్ చైర్మన్‌కు ఆమె అందించారు. బీసీ సంఘాలు, యునైటెడ్ పూలే ప్రంట్, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి ఈ నివేదికను సమర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్‌ను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘాలు, మేధావులు ఇచ్చిన సూచనలను అమలు చేయలేదని విమర్శించారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలలు తాత్సారం చేసిందని ఆరోపించారు. డెడికేటెడ్ కమిషన్ స్వతంత్రంగా పని చేయాలని ఆకాంక్షించారు. అయినా ప్రత్యేక కార్యాలయం, మానవ వనరులు, సామాగ్రి ఇవ్వకుంటే ఆ కమిటీ ఎలా పని చేస్తుందని ప్రశ్నించారు. కుల గణనపై నెల రోజుల్లోనే నివేదిక అంటే ఎన్నో అనుమానాలు వస్తున్నాయన్నారు. డెడికేటెడ్ కమిటీకి చట్టబద్ధత కల్పించాలన్నారు. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికీ స్టిక్కర్ వేయని ఇళ్లు దాదాపు 70 శాతం ఉన్నాయని, కానీ సర్వే మాత్రం 90 శాతం పూర్తయిందని చెప్పడం ఏమిటన్నారు. కులగణకు బీజేపీ వ్యతిరేకమి విమర్శించారు. కులగణన చేపట్టబోమని బీజేపీ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది వెల్లడించారు. ఆ పార్టీ తీరును బీసీలు ఖండించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్‌లో ఎన్నో హామీలు ఇచ్చిందని, ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Also Read : మహారాష్ట్ర సీఎం పదవిపై ఉత్కంఠ... స్పందించిన అజిత్ పవార్

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :