Studio18 News - TELANGANA / : గాలి ఎంత పరిశుభ్రంగా ఉంటే... మన ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా అంత బాగుంటుంది. కలుషిత గాలి వల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా దేశ రాజధాని ఢిల్లీ నిలిచింది. ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) ఏకంగా 400 పాయింట్లు దాటిపోయింది. కొంత దూరంలోని భవనాలు, ప్రాంతాలు కూడా కనిపించనంతగా వాయు కాలుష్యం పెరిగిపోయింది. దేశంలోని మరికొన్ని నగరాలు, పట్టణాల్లోనూ ఇలాగే గాలి కాలుష్యం పెరిగిపోయింది. ఇదే సమయంలో దేశంలోని కొన్ని పట్టణాలు కాలుష్యం లేని పరిశుభ్రమైన గాలితో ఆకట్టుకుంటున్నాయి. ‘ఐక్యూఎయిర్’ సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆ పట్టణాల వివరాలివిగో.. దేశంలో అత్యంత పరిశుభ్రమైన గాలి ఉన్న పట్టణ ప్రాంతం తమిళనాడులోని పల్కలైపెరూర్... ఇక్కడ గాలి ఏక్యూఐ 20 పాయింట్లు మాత్రమే. ఒడిశాలోని బాలాసోర్ ఏక్యూఐ 23... మిజోరం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ ఏక్యూఐ 25 మాత్రమే. కేరళలోని కొల్లాం 25 ఏక్యూఐతో... గోవా రాజధాని వాస్కోడగామా 28 ఏక్యూఐతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తమిళనాడులోని నాగర్ కోయిల్ 29 ఏక్యూఐ మాత్రమే. ఇది కాస్త అభివృద్ధి చెందిన పట్టణం. అయినా గాలి పరిశుభ్రంగా ఉండటం గమనార్హం. కేరళ రాజధాని తిరువనంతపురం ఏక్యూఐ 29. దక్షిణాది రాష్ట్రాల రాజధాని నగరాల్లో అత్యంత తక్కువ ఏక్యూఐతో, పరిశుభ్రమైన గాలి ఉన్న నగరంగా తిరువనంతపురం నిలిచింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ గాలి నాణ్యత 45 నుంచి 70 ఏక్యూఐ వరకు ఉంటుంది. తెలంగాణలోని హైదరాబాద్ నగరం ఏక్యూఐ 110. నగరంలో ప్రాంతాన్ని బట్టి 85 నుంచి 130 ఏక్యూఐ వరకు గాలి నాణ్యత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఏక్యూఐ 90 వద్ద... విజయవాడ ఏక్యూఐ 60 పాయింట్ల వద్ద ఉన్నాయి.
Also Read : రఘురాజుకు ఊరట... విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు
Admin
Studio18 News