Studio18 News - తెలంగాణ / : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అనుచరుడు మారు గంగారెడ్డి (58) హత్యకేసు నిందితుడు సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి కారు, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. సంతోష్ మొబైల్ ఫోన్ డేటాను పరిశీలించిన పోలీసులు ఘటనకు ముందు అతడు ఎవరెవరితో మాట్లాడాడన్న విషయాన్ని నిర్ధారించుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అతడిని ఓ పోలీస్ స్టేషన్‌లో ఉంచి ప్రశ్నిస్తున్న పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. జీవన్‌రెడ్డికి నాలుగు దశాబ్దాలుగా రాజకీయ అనుచరుడిగా కొనసాగుతున్న గంగారెడ్డి నిన్న ఉదయం జగిత్యాలలోని తన సొంత గ్రామం జాబితాపూర్‌లో బైక్‌పై వెళ్తుండగా బత్తిని సంతోష్‌గౌడ్ కారుతో వెనక నుంచి ఢీకొట్టాడు. కిందపడిన గంగారెడ్డిపై అందరూ చూస్తుండగానే కత్తితో దాడిచేశాడు. చాతీలో, కడుపులో విచక్షణ రహితంగా పొడిచాడు. ఆపై తన సెల్‌ఫోన్‌ను వేరే చోట పడేసి మరో కారులో పరారయ్యాడు.
Admin
Studio18 News