Studio18 News - TELANGANA / HYDERABAD : హైదరాబాద్‌లో ద్విచక్ర వాహనాల స్వయం ఉపాధి పథకానికి సంబంధించిన గడువు పొడిగింపుపై కీలక నిర్ణయం వెలువడింది. ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ నూతన హైదరాబాద్ కార్యవర్గం ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు గడువు పొడిగించాలని వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయం నుండి ఫోన్ కాల్ ద్వారా గడువును పొడిగించినట్లు సమాచారం అందింది. అధికారికంగా ఈ పథకానికి దరఖాస్తుల సమర్పణ గడువును 2026 ఏప్రిల్ 2 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ నిర్ణయం పథకం లబ్ధిదారులకు ఊరటనిచ్చేలా ఉందని, ఇంకా దరఖాస్తు చేసుకోని వారు ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలని కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. ఇప్పటికైనా అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుని గడువు ముగియకముందే దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించే ఈ పథకం ద్వారా అనేక మంది యువత, నిరుద్యోగులు లబ్ధి పొందే అవకాశం ఉంది.
Admin
Studio18 News