Monday, 08 December 2025 04:02:20 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Bus Accident: ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు.. కన్నుమూసి తెరిచేలోపు ఘోరం జరిగింది: బస్సు ప్రమాదంపై కండక్టర్

Date : 03 November 2025 06:30 PM Views : 145

Studio18 News - TELANGANA / RANGAREDDY : చేవెళ్ల సమీపంలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లోడుతో వెళుతున్న లారీ ప్రమాదంలో స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకున్న కండక్టర్ బస్సులో పోలీసులు, ఉద్యోగులు సహా 72 మంది ప్రయాణికులు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై బస్సు కండక్టర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మీర్జాగూడ వద్దకు బస్సు రాగానే ఏం జరుగుతుందో క్షణంపాటు అర్థం కాలేదని, కన్నుమూసి తెరిచేలోపు ఘోరం జరిగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కండక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మీడియాతో మాట్లాడుతూ, బస్సులో పోలీసులు, ఉద్యోగులు సహా మొత్తం 72 మంది ప్రయాణికులు ఉన్నారని ఆయన తెలిపారు. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి 163పై మీర్జాగూడ వద్ద ఈ రోజు ఉదయం తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఈ ధాటికి బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దాని కింద కూరుకుపోయారు. ఈ దుర్ఘటనలో వికారాబాద్ జిల్లా యాలాల మండలం హాజీపూర్‌కు చెందిన బండప్ప, లక్ష్మీ దంపతులు మృతి చెందారు. దీంతో వారి కుమార్తెలు భవాని, శివలీల అనాథలయ్యారు. తల్లిదండ్రుల మరణంతో ఆ చిన్నారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండటంతో అక్కడున్న వారి హృదయాలు బరువెక్కాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :