Studio18 News - TELANGANA / HYDERABAD : హైదరాబాద్ : హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం(Fire accident)చోటు చేసుకుంది. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర్ కాలనీలో మెకానిక్ షాప్‌లో అర్ధరాత్రి 2 గంటల సమయం అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడటంతో గమనించి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Admin
Studio18 News