Tuesday, 31 March 2026 04:27:47 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

సి.ఎం.ఎలో జాతీయ స్థాయిలో రాణించిన ఖమ్మం విద్యార్థిని అఖిల నాగ రమ్య

Date : 31 March 2026 12:42 PM Views : 7

Studio18 News - TELANGANA / KHAMMAM : ఖమ్మం, మార్చి 30: ఖమ్మం నగరానికి చెందిన విద్యార్థిని అర్వపల్లి అఖిల నాగ రమ్య జాతీయ స్థాయిలో నిర్వహించిన సి.ఎం.ఎ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి, బెంగళూరు వేదికపై ప్రశంసలు అందుకుని జిల్లా ఖ్యాతిని చాటింది. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఈ విజయంతో తల్లిదండ్రుల కష్టానికి తగిన ప్రతిఫలం అందించడమే కాకుండా, అనేక మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచింది. ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెంకు చెందిన అర్వపల్లి నగేష్–శ్రీలక్ష్మి దంపతుల కుమార్తె అయిన అఖిల నాగ రమ్య చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచింది. మౌంట్ ఫోర్ట్ స్కూల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివి, పదో తరగతిలో 9.5 జీపీఏతో పాఠశాల టాపర్‌గా నిలిచింది. అనంతరం సాహితి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లోనూ అగ్రశ్రేణి ఫలితాలు సాధించింది. ఆమె ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వెనుకడుగు వేయకుండా గుంటూరులోని ప్రముఖ ‘మాస్టర్ మైండ్’ కాలేజీలో సి.ఎం.ఎ కోర్సులో చేర్పించారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో అఖిల నాగ రమ్య జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించి, బెంగళూరులో జరిగిన గౌరవ కార్యక్రమంలో ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా అఖిల మాట్లాడుతూ, “నా విజయానికి ప్రధాన కారణం నా తల్లిదండ్రులే. వారి కష్టం, ప్రోత్సాహమే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చాయి. నా విజయం వారికే అంకితం” అని తెలిపింది. అఖిల నాగ రమ్య విజయం పట్ల స్థానికులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఆమె చెల్లెలు యువ నాగశ్రీ ప్రస్తుతం గుంటూరులో చార్టెడ్ అకౌంటెన్సీ (సి.ఏ) కోర్సు అభ్యసిస్తుండటం కుటుంబంలో విద్యాపట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. సంకల్పం, కృషి, కుటుంబ సహకారం ఉంటే ఎంతటి ఉన్నత స్థాయికైనా చేరుకోవచ్చని అఖిల విజయం మరోసారి నిరూపించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :