Monday, 08 December 2025 04:02:56 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

మ‌మ్మ‌ల్ని అతిగా ప్రేమించ‌డ‌మే మా నాన్న చేసిన త‌ప్పు.. ఉద్దేశ‌పూర్వ‌కంగా మేము ఎవ‌రిపైనా దాడి చేయ‌లేదు: మంచు విష్ణు

నిన్న రాత్రి మ‌రింత ముదిరిన మంచు ఫ్యామిలీ వివాదం ఈ నేప‌థ్యంలో మంచు విష్ణు తాజాగా మీడియా స‌మావేశం ప్ర‌తి ఇంట్లో ఇలాంటి స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని వ్యాఖ్య‌ ఓ త

Date : 11 December 2024 02:15 PM Views : 396

Studio18 News - TELANGANA / : మంచు ఫ్యామిలీ వివాదం మంగ‌ళ‌వారం రాత్రి మ‌రింత ముదిరిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మంచు విష్ణు తాజాగా మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో మంచు విష్ణు మాట్లాడుతూ.. "ప్ర‌తి ఇంట్లో ఇలాంటి స‌మ‌స్య‌లు ఉంటాయి కాబట్టి, ఈ విష‌యాన్ని పెద్ద‌దిగా చేయ‌డం త‌గ‌దు. ఇది నా రిక్వెస్ట్. నిన్న జ‌రిగిన దాడిలో నాన్న‌కు గాయాల‌య్యాయి. కుటుంబ గొడ‌వ‌ల కార‌ణంగా మా అమ్మ ఆసుప‌త్రి పాలైంది. గేట్లు ప‌గ‌ల‌గొట్టుకుని మ‌రీ మ‌నోజ్ లోప‌లికి వ‌చ్చాడు. ఓ తండ్రిగా మ‌నోజ్‌పై నాన్న త‌క్కువ‌గానే రియాక్ట్ అయ్యారు. మ‌మ్మ‌ల్ని అతిగా ప్రేమించ‌డ‌మే మా నాన్న చేసిన త‌ప్పు. మేము క‌లిసి మెలిసి ఉంటాం అనుకున్నా. కానీ, దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఇలా జ‌రిగింది. మేము మ‌ళ్లీ తిరిగి క‌లుస్తామ‌ని ఆశిస్తున్నా. నిన్న జ‌రిగిన గొడ‌వ‌లో ఒక రిపోర్ట‌ర్‌కు గాయాల‌య్యాయి. అది దుర‌దృష్ట‌క‌రం. మీడియా వారికి ఆయ‌న‌ నమస్కరిస్తూ వచ్చారు. కానీ, మోహం మీద ఎదో పెట్టారని.. అలా జరిగిపోయింది. గాయ‌ప‌డిన రిపోర్ట‌ర్ ఫ్యామిలీ తో టచ్ లో ఉన్నాము. ఉద్దేశ‌పూర్వ‌కంగా మేము ఎవ‌రిపై దాడి చేయ‌లేదు. పోలీసులు మా కంటే ముందు మీడియాకు నోటీసులు లీక్ అవుతున్నాయి. ఇవాళ ఉద‌యం 9.30 గంట‌ల‌కు నాకు పోలీసుల నోటీసులు వ‌చ్చాయి. పోలీసు విచార‌ణ‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం నాకు లేదు. మాకు ఏం ప్రొటెక్షన్ ఇచ్చారు. కానీ, వ్య‌వ‌స్థ‌పై గౌర‌వం ఉంది కాబట్టి సీపీని క‌లుస్తాను. ప్రేమలో గెలవాల్సిన విషయాలపై రచ్చ పెట్టుకుంటే ఏది జరగదు. మనోజ్ ఆరోపణలపై నేను చెప్పెది ఏమి లేదు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుద్ది. నేను నా కుటుంబ విషయాలు మాట్లాడను. నేను ఇక్కడ ఉంటే, ఫిర్యాదుల వరకు వెళ్లేది కాదు. నాన్న గారి ఆస్తి ఆయన ఇష్టం. ఎంతో కష్టపడి స్వయం కృషితో గొప్ప స్దాయికి ఎదిగారు. మాకిచ్చే లభించే గౌరవం ఆయనవల్లే. కుటుంబం పరంగా నాన్న ఏది అనుకుంటే అదే ఉండాలి. తల్లిదండ్రుల‌ను గౌర‌వించ‌డం పిల్ల‌లుగా మా బాధ్య‌త‌. మీడియాలో కొంతమందే హద్దు మీరుతున్నారు. అందరూ కాదు. పబ్లిక్ ఫిగర్స్ పై రిపోర్ట్ చేయటం మీడియా బాధ్యత‌. కానీ సోసైటీలో కొందరు ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక వినయ్ నాకు అన్న లాంటి వారు. ఆయన ఎవరిపైనా చేయి చేసుకోలేదు. వినయ్ కు నాకు 15 ఏళ్ల పరిచయం ఉంది. ఇండియాలోనే గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు యూనివర్సిటీకి మంచి పేరు ఉంది. ఇండియాకు ఫారిన్ యూనివర్సిటీలను తీసుకువచ్చే ఘనత మాదే అవుతుంది. ఇప్ప‌టికే ఆ వైపుగా చ‌ర్చ‌లు జరుగుతున్నాయి. మోహన్ బాబు గారిని నమ్మి అక్కడ తమ పిల్లలను జాయిన్ చేస్తున్నారు. అది మాకు దేవాలయం. యూనివ‌ర్సిటీ జోలికి వ‌స్తే ఊరుకునేది లేదు. ఇక మా అక్కకు, నాకు భేదాభిప్రాయాలు ఉన్నా.. ఆమె కొట్టినా తిట్టినా నేను పడతాను. ఎందుకంటే తను నా అక్క. మా కుటుంబంలో బయటి వ్యక్తుల ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఉంటే వారికి ఈ సాయంత్రం వ‌ర‌కు సమయం ఇస్తున్నాము. లేదంటే అందరి పేర్లు నేనే బయడపెడతాను. మా నాన్న చెప్పిందే వేద వాక్కు. ఆయన చెప్పింది నేను చేస్తాను. కానీ నా తమ్ముడిపై నేనిప్పుడు దాడులు చేయను. నా సినిమా, మా అసోసియేషన్ గురించి తప్ప నేను ఏ విషయంలో మాట్లాడను‌. కానీ నాకు కనుక అవకాశం ఉంటే ఫిర్యాదులు, వాయిస్ మెసెజ్ కూడా బయటికి వచ్చేది కాదు. సమయమే అన్ని స‌మ‌స్య‌ల‌కు సమాధానం ఇస్తుంది. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో నరకం చూశాను. మీ తల్లి మీకు ఫోన్ చేసి ఎడుస్తుంటే దాన్ని మించిన బాధ ఇంకేమి ఉండదు" అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

Also Read : మంత్రి లోకేశ్ ను మెచ్చుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :