Sunday, 29 March 2026 05:24:07 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

మున్సిపోల్స్‌లో గులాబీ జెండా ఎగురేస్తాం

మున్సిపల్‌ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీలోకి పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారు.

Date : 28 January 2026 07:04 PM Views : 93

Studio18 News - TELANGANA / HYDERABAD : మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి.. మేడ్చల్‌ జిల్లా నుంచి బీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు మేడ్చల్‌, జనవరి27(నమస్తే తెలంగాణ): మున్సిపల్‌ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీలోకి పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మూడుచింతపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అద్రాస్‌పల్లి, ఎల్లంపేట్‌ మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు మంగళవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవరం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు వెంకటేశ్‌గౌడ్‌, మల్లేశ్‌ ముదిరాజ్‌, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రభాకర్‌రెడ్డితో పాటు 20 మంది కార్యకర్తలు పార్టీలో చేరగా ఎల్లంపేట్‌ మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్‌కు చెందిన గుంటి చిన్న కుమార్‌, గుంటి భాస్కర్‌, అన్నారం శ్వామ్‌కుమార్‌, గంటి నర్సింగ్‌రావు, సంచు లింగం, జక్కుల ప్రవీణ్‌, జక్కుల వంశీ, బోయిని సత్యనారాయణ, అన్నారం నర్సింహ, జక్కుల శోభ, జక్కుల భిక్షపతి, జక్కుల కృష్ణ, ఉప్పరి సత్తయ్య, గుంటి మహేందర్‌తో పాటు 100 మంది మహిళలు, యువకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. అద్రాస్‌పల్లిలో భారీ ర్యాలీ.. మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అద్రాస్‌పల్లిలో ముందుగా మాజీమంత్రి మల్లారెడ్డి చేతులమీదుగా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. కాంగ్రెస్‌తో ప్రజలు బేజార్‌.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ప్రజలు బేజార్‌ అవుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. అద్రాస్‌పల్లిలో ర్యాలీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఎ ఒక్క హామీని అమలు చేయడంలేదన్నారు. వారి మోసపూరిత హామీలను ప్రజలు గుర్తించి ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు మద్దతు పలుకుతున్నారన్నారు. జిల్లాలో జరగనున్న మూడు మున్సిపాలిటీల ఎన్నికల్లో తప్పకుండా బీఆర్‌ఎస్‌ జెండా ఎగరడం ఖాయమన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :