Monday, 16 March 2026 01:54:05 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం

Date : 07 March 2026 06:54 PM Views : 20

Studio18 News - TELANGANA / NIRMAL : ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు శనివారం పట్టణంలోని హోటల్ మారుతి ఇన్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం వివరాలను లబ్ధిదారులకు తెలియజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రుణ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. పేదల ఉన్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. పేద ప్రజలు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వ్యాపారంలో అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా లబ్ధిదారులు స్వయం ఉపాధి పొందడమే కాకుండా ఇతరులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగగలరని చెప్పారు. ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలపై అవసరమైన అవగాహన పెంపొందించుకొని వాటి మెలుకువలను నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహ రెడ్డి, ఎల్డీఎం రామ్ గోపాల్, ఇండియన్ పోస్ట్స్ మేనేజర్ వీరస్వామి, పోస్టల్ ఇన్స్‌పెక్టర్ రాజేంద్ర యాదవ్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మేనేజర్ దినేష్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :