Studio18 News - తెలంగాణ / : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు కవిత మంగళవారం ఆసుపత్రిలో చేరారు. కొంతకాలంగా కవిత పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరారని పార్టీ వర్గాలు తెలిపాయి. నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి కవిత వెళ్లారు. కవిత ఆసుపత్రిలోకి వెళుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. కాగా, సాయంత్రం వరకు వైద్యులు ఆమెకు వివిధ పరీక్షలు చేయనున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో కవిత ఇటీవలి వరకు తీహార్ జైలులో గడిపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే కవితను ఆనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయని, జైలులోనూ ఆమె చికిత్స తీసుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కోర్టు సూచనలతో జైలు అధికారులు కవితను ఎయిమ్స్ కు తీసుకెళ్లి చికిత్స చేయించారు. కాగా, ఎమ్మెల్సీ కవిత గైనిక్ సమస్యలు, జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
Admin
Studio18 News